Frustration of JNTU'S..


 నా పేరు *******, ఫిబ్రవరి 7 JNTU బాధితుడ్ని. నేను   మల్లా ____ కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుతున్నాను.(నేను caste feeling కి వ్యతిరేకం కావున మా కాలేజ్ పేరు "మల్లా" అని చెబుతున్నాను. మీరు మళ్ళా అడిగినా నేను "మల్లా" అనే చెబుతాను.ఇంత చెప్పినా మా కాలేజ్ పేరు అర్ధం చేసుకోలేని మేధావుల కోసం ఈ క్రింది ఆప్షన్లు..

A)మల్లారాజు కాలేజ్
B)మల్లారెడ్డి కాలేజ్
C)మల్లాచౌదరి కాలేజ్
D)మల్లానాయుడు కాలేజ్

(మీ సరైన సమాధానాన్ని "NAA BONDHA SPACE {YOUR OPTION} " అని టైప్ చేసి చిరంజీవికి మెసేజ్  పెట్టండి (కేవలం జియో సిమ్ యూజర్స్ కు మాత్రమే..)

ఇక అసలు విషయంలోకి వద్దాం...
ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా నీకెన్ని మిగిలాయి.,నాకిన్ని మిగిలాయి అనుకోవటాలు మామూలే మా బి.టెక్ వాళ్లకి.కానీ ఈ సారి సీన్ మారింది.అందరి మొహాలు ఎర్రబడ్డాయి.నాకు తెలిసిన ఫ్రెండువి ఏకంగా అయిదు సబ్జెక్టులు పోయాయి.నేను వాడ్ని ఓదారుద్దామని భారీ డైలాగులు ప్రిపేరై వాడి రూంకి  వేలితే వాడు అన్నీ సర్దుకుని ఇంటికి పోయాడంట.సాధారణంగా ఒకటో రెండో సబ్జెక్టులు మిగిలితే ఎవరూ అంత బాధపడరు.పక్కనోడి బ్యాక్ లాగ్లు చూసి సంతృప్తి పడతారు. రీ కరెక్షణో,సప్లై నో పెట్టి గట్టెక్కేస్తారు. కానీ ఆ సంఖ్య నాలుగు,అయిదుకి పెరిగితేనే ప్రమాదం.వైరాగ్యం వచ్చేస్తుంది.చదువు మానేద్దాం అనిపిస్తుంది.బిజినెస్ మొదలు పెడదామనిపిస్తుంది.అలా అనుకోవడమే కాకుండా నరసింహ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో (జీవితమంటే పోరాటం...) కలలు కనేస్తారు కొందరైతే.,

బి.టెక్ లో చదివిరాసే వాళ్లుంటారు.బుస కొట్టేవాళ్లుంటారు.
రెండో రకం వారు అసాధ్యులు, ఉద్ధండులు.
ఒకడైతే "నా పేరు ******,నేను *****లో వుంటాను. దయ చేసి నన్ను పాస్ చెయ్యండి. మీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను.  **********  ఇది నా ఫోన్ నంబర్ .ప్లీజ్ ఫోన్ చేయండి." ఈ తరహా లో రాసాడంట.
మరొకడైతే "ప్లీజ్ నన్ను పాస్ చేయండి, ప్లీజ్ నన్ను పాస్ చెయ్యండి" అని ఇరవై పేపర్లు నింపాడంట.ఆ పేపర్ దిద్దిన సార్ ఆరోగ్య దృష్ట్యా మళ్లీ కరెక్షన్ చేయడానికి వెళ్లలేదంట.
'మేము జెన్యూన్ గా చేస్తే మీకొచ్చే పది మార్కులు కూడా రావు.ఏ మూలనైనా కొంతైనా రాసాడేమో పాస్ చేద్దాం అని ట్రై చేస్తాం.,ఒక్క ముక్క కూడా రాయకుండా ఎలా పాస్ చేసేది? "
                                              -ఓ మాష్టారి రియాక్షన్

కానీ ఈ సారి ఆ ఒక్క ముక్క రాసేవాళ్లతో పాటు 75 కి 60 వస్తాయని అనుకున్న వాళ్ల సబ్జెక్టులు కూడా ఆగాయి.అయిదు పది మార్కుల జవాబుల్ని రాసినోడికి 26 మార్కులు కూడా రాకపోతే వాడికెలా వుంటుంది?. ఇంట్లో వాళ్ల ముందు,ఫ్రెండ్స్ ముందు భుజాలేగారేసేసి వుంటారు.ఇప్పుడు వాళ్లని ఎలా ఎదుర్కొనేది?

ఇక మా చెల్లెళ్ల బాధ ఏమని చెప్పేది.(ఓ ముప్పై మంది తప్ప అందరూ ) మిడ్ ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులొస్తేనే టిష్యూలు తడిపేసే సున్నిత మనస్కులు వారు.ఏ నాడు ఫెయిలై ఎరిగి వుండరు.వారికిది క్లిష్ఠ పరిస్థితి.సెలవులకి ఇంటికెలితే 'బావున్నావా' కంటే  ముందే 'మీ క్లాస్ ఫస్ట్ నువ్వేనా' అని అడుగుతారు,పక్కింటి ఆంటీలు.బి.టెక్ కి వచ్చినా ఈ ఫస్ట్ రాంక్ గోలేంటో,ఎంత వాళ్లబ్బాయి చైతన్యలో చదువుతుంటే మాత్రం.



అయితే ఫెయిల్ అవుతామనుకున్న వాళ్లు పాస్ అవడం కూడా జరుగుతూనే ఉంటాయి JNTU కరెక్షన్ లో. అయితే ఈ సారి అటువంటివి రిపీట్ అవ్వకపోగా, అరవై మంది వుండే క్లాసులో అన్నీ గట్టెక్కిన వాళ్లు ఇరవైకి పైగా ఏ బ్రాంచ్ లో లేరు*.  (tems and conditions apply)

 అసలు రీ కరెక్షన్లో  (రీ ఎవాల్యూషన్) మళ్లీ పాస్ అయిన వారికి రీ కరెక్షన్ కోసం కట్టిన ఫీజు తిరిగి ఇచ్చేయ్యాలి.ఎందుకంటే కరెక్షన్ సరిగ్గా చేయకపోవడం దిద్దే వాడి తప్పు.అంటే సరిగ్గా రాయక సప్లై రాసేవాడు ఫీజు కట్టాలి, సరిగ్గా రాసి దిద్దేవాడి కారణం గా ఫెయిల్ అయి అవమానాన్ని మూట కట్టుకున్న అభాగ్యుడూ ఫీజు కట్టాలా? ఇది ఎంతవరకూ సమంజసం?

JNTU లో ఒక్కొక్క పేపర్ని ఇద్దరు కరెక్షన్ చేస్తారు.మొదటి కరెక్షన్ చేసినవాడు స్క్రిటినైజర్ కి పంపుతాడు.కరెక్షన్ సరిగ్గా చేశాడోలేదో చూడటం స్క్రిటినైజర్ వంతు బాగా రాసినవాడికి రెండు చోట్ల చుక్కెదురైందంటే ఏదో తేడా జరిగే వుండాలి కదా..?

JNTU లో కరెక్షన్ చేసే వారు రోజుకి రెండు బండిల్లు కరెక్షన్ చేస్తారు.బండిల్ కి సుమారు 60 పేపర్లుంటాయి.అంటే మొత్తం 120 పేపర్లు.ఆరు గంటల్లో 120 పేపర్లంటే ఒక్కో పేపర్ మూడు నిమిషాలు. ఒక విద్యార్థి మూడు గంటలు రాసే పేపర్ని మూడు నిమిషాల్లో కరెక్షన్ చేస్తారు.అదీ టీ తాగుతూ., ట్రంప్ మోడీని దేకుతాడా లేదా అనో,చిరంజీవికి పొట్ట ఎక్కువుందా బాలయ్యకి పొట్ట ఎక్కువుందా అని ఏవో కబుర్లు చెప్పుకుంటూ చేస్తార(ట)...,(విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...)

నిరసనలు...


ఈ విషయం ప్రజాప్రతినిధులదాకా వెళ్లింది. సానుకూల స్పందన వస్తుందని రెండు లక్షల కళ్లతో (100,000×2)ఎదురు చూస్తూ...,


( నేను మంచి వాడ్ని కాబట్టి ఈ వ్యాసంలో బూతులేమి లేవు.బూతులు కావాల్సినవాళ్ళు ఈ క్రింది నంబర్లు సంప్రదించగలరు........

(మీకు తెలిసిన JNTU విద్యార్ధికెవరికైనా ఫోన్ చేసి JNTU కరెక్షన్ గురించి అడగండి)

Comments

Popular Posts